మసాలా ఆమ్లెట్ | Masala Walnut Omelette | Breakfast Recipes | Egg Recipes | Healthy Breakfast Ideas | Walnut Recipe
మసాలా ఆమ్లెట్ చాలా తేలికైన బ్రేక్‌ఫాస్ట్, ఇంకా చాలా హెల్తీ కూడా. దీనిలో అక్రోట్లు వేయడం వలన ఈ ఆమ్లెట్లో మంచి రుచి, క్రంచ్ కూడా జోడవుతాయి. తప్పకుండా ఈ మసాలా ఆమ్లెట్‌ను ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#masalaomelette #homecookingtelugu #spicyeggomelette #homecooking #hemasubramanian #omelette #healthybreakfastideas #breakfast #eggrecipes #walnut #walnutrecipes #cooking #easyrecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 6
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
తరిగిన వెల్లుల్లి రెబ్బలు
తరిగిన కొత్తిమీర
అక్రోట్లు - 1 / 2 కప్పు (తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
గుడ్లు - 6
నూనె - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్లో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి తరిగిన కొత్తిమీర, తరిగిన ఆక్రోట్లు, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలిపి కనీసం ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి
ఇప్పుడు ఇంకొక బౌల్లో గుడ్లను పగలకొట్టి వేసి, బాగా గిలక్కొట్టాలి
ఈ గిలకొట్టిన గుడ్లను ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కలపాలి
ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి, అందులో గరిటెతో గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేయాలి
ఆమ్లెట్ ఒకవైపు కాలిన తరువాత, పైన కొద్దిగా నూనె వేసి, ఇంకొక వైపుకి తిప్పి కాల్చాలి
అంతే, మసాలా ఆమ్లెట్ తయారైనట్టే, వీటిని వెంటనే వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/0ULSMlXZIf8/maxresdefault.jpg)