మంచినటుడు అవుతావని మహానటి సావిత్రితో అనిపించుకోవడం తనకు వెయ్యిఏనుగుల బలాన్నిచ్చిందని మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. సావిత్రితో కలిసి నటించే అవకాశం దొరకడం...... తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్న చిరంజీవి........ఆ మహానటిని ఎప్పుడు తన మనసులో ఆరాధిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రముఖ సినీ విశ్లేషకులు, రచయిత సంజయ్ కిషోర్ రచించిన......... సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని తనసతీమణి సురేఖతో కలిసి సావిత్రికుమార్తె విజయచాముండేశ్వరి సమక్షంలో చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ వేడుకకు సీనియర్ నటీనటులు...... మురళీమోహన్, జయసుధ, హాస్యనటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరిణి, అల్లు అరవింద్ హాజరై సినీ రంగంలో సావిత్రి సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఇంట్లో భగవద్గీత, భాగవతం ఉన్నట్లుగానే సినీ కుటుంబాల్లో, అభిమానుల ఇళ్లల్లో సావిత్రి క్లాసిక్స్ పుస్తకం ఉండాలని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. పుస్తకావిష్కరణకు పెద్దగా నిలిచిన చిరంజీవి.... కళ్లతో హావభావాలు పలికించగలిగే ప్రపంచంలోని ఏకైక తెలుగు నటి మహాసావిత్రి అని కొనియాడారు. పుస్తకావిష్కరణ వేడుకలో చిరంజీవి సతీమణి సురేఖ, సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి మధ్య జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : [ Ссылка ]
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : [ Ссылка ]
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe for Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!