CREDITS:
SONG : ERIGIYUNNAANAYA
ALBUM : NEE NEEDALO
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
మార్పులేని దేవుడ నీవని – మాట ఇచ్చి నెరవేర్చుతావని '2'
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా '2'
అక్కున నన్ను చేర్చుకుంటివే – భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే
మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా '2'
నిరాశలో నన్ను దర్శించితివే – ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే – కృపను పంచితివే
Ещё видео!