#arstevenson #Telugusong #AkshayaPraveen #songs2021
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా
watch other video
నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Nenendukani Nee Sothuga || COVER SONG || BY AKSHAYA PRAVEEN ||
[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/EgBlmzRCJD0/maxresdefault.jpg)