అష్ట కష్టాలను నివారించే సంకటనాశన గణేశ స్తోత్రం Sankatanasana Ganesha Stotram with Telugu Lyrics and Meaning.
#SankataNasanaGaneshaStotram #SankataNasanaGanapathiSthothram #BhaktiSannidhi #DevotionalSongsInTelugu
Sankata Nasana Ganesha Stotra is taken from the Narada Purana. Chanting this Ganesha Stotra daily will removes all obstacles and ensures success all round us.
As the name indicates, the SANKATA HARA GANESHA STOTRAM is a very powerful. This sloka is chanted daily for three times to get rid of all the problems. Praying this Stotram will help to get knowledge, wealth, get salvation and all wishes fulfilled
SANKATANASANA GANAPATI STOTRAM
స్తోత్రం:-
ప్రణమ్య శిరసా దేవం గౌరి పుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామ్యార్థ సిద్ధయే!
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
త్రితీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం
లంబోదరం పంచమం చ షష్ఠం వికట మేవ చ
సప్తమం విఘ్న రాజాం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్
నవమం బాల చంద్రం చ దశమం తు వినాయకం
ఏకాదశం గణపతిమ్ ద్వాదశం తు గజాననం!!
ద్వాదశైతాని నామాన్ని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్న భయం తస్య సర్వ సిద్ధి కరం ప్రభో!
స్తోత్ర అర్థం:
ఆయుస్సు పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకొనే భక్తులు నిత్యం గౌరీపుత్రుడైన వినాయకుని శిరసు వంచి ప్రణమిల్లవలెను.
మొదట - వంకర తిరిగిన తొండము కలవానిగా,
రెండు - ఒకే దంతము కలవానిగా,
మూడు - నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా,
నాలుగు - ఏనుగు ముఖము కలవానిగా గణేశుని భావింపుము.
ఐదు - పెద్ద ఉదరము కలవానిగాను,
ఆరు - శత్రువుల పట్ల క్రూరంగ ప్రవర్తించువానిగా,
ఏడు - విఘ్నములని తొలగించువానిగా,
ఎనిమిది - పొగ వంటి తెల్లని శరీర కాంతి కలవానిగా విఘ్నేశ్వరుని భావింపుము.
తొమ్మిది - బాల చంద్ర రేఖ నుదుటన కలవానిగా,
పది - విశిష్టమైన నాయకునిగా,
పదకొండు - ప్రమాద గణములకు అధిపతిగా,
పన్నెండు - ఏనుగు ముఖము కలవానిగా వినాయకుని భావింపుము.
ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయం సంధ్య ల లో పఠింతురో, వారికి విఘ్న భయం ఉండదు. వారు కోరినది సాధించును. విద్యను కోరిన వారికి విద్యను, ధనము కోరిన వారికి ధనము లభించును.
[ Ссылка ]
Thanking You..
Ещё видео!