AJEYUDA NAA YESAYYA | 2023 NEW YEAR SONG | BRO MATHEWS | KRUPA MINISTRIES, GUNTUR | 4K
పల్లవి : అజేయుడా నా యేసయ్యా - నీవు నా తోడు ఉన్నావయ్యా
హర్షించి ఆరాధింతును - నీ కృప నాపై కురిపించినందున ||2||
విధాతవు నీవయ్యా - నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే కొనియాడెద యేసయ్యా ||2||అజేయుడా||
1) లోకారణ్యములో - స్నేహితుడవైనావు
అలసిన వేళలో - నను బలపరిచితివి ||2||
సుఖ దుఃఖములో భాగస్వామివై ||2||
ఎనలేని ప్రేమను నాకు పంచితివి ||2||విధాతవు||
2) సమస్యల సాగరం - నను ముంచ చూడగా
సరసన నిలిచి - నన్నాదుకున్నావు||2||
ఆపద సమయములో – ఆశ్రయదుర్గమై ||2||
నీ కౌగిలిలో ననుచేర్చి – ఆదరించితివి ||2||విధాతవు||
3) ఆత్మీయ యాత్రలో - నా తోడు ఉన్నావు
నీ అనుభవముతో - అణుకువ నేర్పితివి ||2||
శోధనవేదనలో కన్నతండ్రివై ||2||
అనురాగం ఆనందం నాకు పంచితివి ||2||విధాతవు||
Ещё видео!