maa vadina garitho kalisipadina Vinayakuni Mangala Harathi
Rachana : Satyavada sodaree manulu
రచన : సత్యవాడ సోదరీమణులు
రాగం : ఆనంద భైరవి
తాళం : ఆది తాళం
జగదంబ తనయునకు జయ మంగళం
సురలోక పూజ్యునకు శుభమంగళం
ఆగమా నుతునకు ఆర్ద్రహృదయునకు
అతివలు పాడేరు ఆర్తితో మంగళం ||జయ||
మోదకా హస్తునకు ముక్కంటి సుతునకు
సిద్ధి బుద్ధుల నొసగు శ్రీ గణేశునకు
మాధుర్యమొప్పార మగువలూ పాడేరు
గరిక పూజల మెచ్చు ఘనునకు మంగళం ||జయ||
రవికోటి తేజునకు విఘ్నరాజునకు
నిందలను బాపేటి లంబోదరునకు
నిండైన భక్తితో నిరతము అర్చించి
నెలతలు పాడేరు చెలువార మంగళం ||జయ||
Ещё видео!