SravanaLakshmi song .. written and composed by UVM.Vamsi.
Lyrics are posted in description below.
Sung by ..
smt.Nagamani Vemisetty | smt. Anitha Vaddadi | smt. Anuradha |
smt. Suma | smt. Sobha | smt. Santhi | kum. Lasya Vaddadi |
kum. Manaswi Mamidisetti | kum. Aparna Isukapalli | kum.Ishita
SravanaLakshmi song is a welcome song for Goddess Lakshmi devi in this auspicious Sravana masam [month] . In India it is so popularly known and observed by Indian women with lot of devotion in all house holds all over Bharat. on the Festival of Sri Vara lakshmi Vratam , this song describes the rituals of this puja like a story telling.
our sincere thanks to all who cooperated the entire process to make this possible.
Sravana Lakshmiki swagatamu Lyrics ..
రచన , సంగీతం ] UV. మోహనవంశీ శ్రావణ మాసపు పాట
పల్లవి ] శ్రావణ లక్ష్మికి స్వాగతమూ సాగర కన్యకు స్వాగతమూ
వరలక్ష్మిని మన ఇంటను గొలిచీ చేతము రారే ! ఈ వ్రతమూ !
= శ్రావణ లక్ష్మికి స్వాగతమూ
చరణం 1] మామిడి ఆకులు కలశము తీర్చి పసుపు కుంకుమ పెట్టరటే
జలమును నింపి గంధము వేసి మంత్రాక్షరములు చదువరటే
సమ్మోహనముగ దేవిని నిలిపి ఆవాహనము చేయరటే
= శ్రావణ లక్ష్మికి స్వాగతమూ
చరణం 2] ముతైదువులను ఇంటికి బిలిచి నుదుటను తిలకము దిద్దరటే
చేతుల కెర్రని గాజులు తొడిగి గళమున గంధము పూయరటే
ప్రతి ముత్తైదువు మహలక్ష్మి యనుచు పదముల పసుపును పూయరటే
= శ్రావణ లక్ష్మికి స్వాగతమూ
చరణం 3] పూవులు గాజులు ఆభరణమ్ముల శ్రీవరలక్ష్మిని తీర్చరటే
షోడశ ఉపచారమ్ములు సలిపి తల్లికి పూజలు సేయరటే
సుస్వరముగ కీర్తనముల బాడుచు శుభమ్ముల నిమ్మని కోరరటే
= శ్రావణ లక్ష్మికి స్వాగతమూ
చరణం 4] పాయసములు బహు చిత్రాన్నములు నైవేద్యమ్ములు సేయరటే
ఆకులు వక్కలు కదళీ ఫలముల తాంబూలమ్మును ఇవ్వరటే
కోర్కెలు దీర్చెడి బంగరు తల్లికి కప్పుర హారతి ఇవ్వరటే
గాసుత = శ్రావణ లక్ష్మికి స్వాగతమూ
Ещё видео!