ప్రేమ యేసుని ప్రేమ | Prema Yesuni Prema
Telugu Christian Song | Stay Home | Live Worship
Sung by: Sharon Paul Perli
#premayesuniprema #teluguchristiansong #sharonpaulperli
Lyrics:
ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ
1. తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును
...ఎన్నడెన్నడు...
2. భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును
...ఎన్నడెన్నడు...
3. బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ
నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును
...ఎన్నడెన్నడు...
4.ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును
![](https://s2.save4k.ru/pic/nCC9Fz9VuRY/maxresdefault.jpg)