Producer :- V V Subbaraju
Lyrics :- Mudunuri Sisters (Prasanthi & Srikanthi)
Singer :- Dr.Sumasri Vegesna
Music :- Nani Mohan Karra
Mix & Master :- Amruth Korati
Live Rythms :-Anil Robin Nalluri
Mothukuri Chiranjeevi
Editing :- Rex Dayan
Visuals:- Snappers photography
G. Suryanarayana Raju
Video :- Raja Sompaka
Sound Engineer :- Mahie Kondeti
Recorded @ EVEREST STUDIO,HYD
#sankranthi#sankranthi2022
#sankranthisong#sankrantispecialsong
#sankrantipaata
#sankrantisambaralu#bhogi #palleturu
#sumasrisong#telangana#andhrapradesh
#kanuma#festiveseason#festivemode
#indianfestivals#festivevibes
#sumasri#supersingersumasri#festivalsong
#sumasrivegesna#westgodavari#eastgodavari
సంబరాలే సంక్రాంతి సంబరాలే
అంబరాన్నే తాకేనె సంబరాలే
ఏడాదంతా వేచే పల్లెటూళ్ళే
నవ్వేను చూడె పసిపాపల్లే
( సంబరాలే )
చరణం 1:ముంగిట్లో ముగ్గులు ముగ్గుల్లో గొబ్బిళ్ళు
పరికిణిలో ఆడపిల్లలు భోగి పళ్ళలో బోసినవ్వులు
నింగి తాకే గాలిపటాలు పొంగిపొరలే ధాన్యపురాశులు
వాకిట్లోన హరిదాసులు ముస్తాబుల్లో గంగిరెద్దులు పిట్టల దొరల గొప్పలు ఊరి చివరన కోడి పందాలు సందు సందునా పేకాట బాబులు.. దొరబాబులు ( సంబరాలే )
చరణం 2: స్నేహితుల కలయికతో సగమయ్యే వయసు
గోదారి గల గలలా ఉరికింది మనసు
అయిన వారి అనురాగంతో మురిసిపోవా మూడురోజులు
కోడలైనా కూతురైనా ఊరికి వస్తే ఆనందాలే
ఏడాదంతా ఉరుకుల పరుగులు మనసెంతో అలిసెనే పండగంతా నవ్వుల పువ్వులు అలసిన మనసు మురిసెనే...
సాకీ: భోగిమంటల వెలుగులతో ఆహ్వానించు ఆనందాన్ని
సంకురాతిరి సందడిలో ఆదరించు అతిథులని కనుమన కోరుకో పెద్దల దీవెన
మరువక చేసుకో పశువుల పోషణ
ముక్కనుమ ముగిసెనే ముక్కలతో
మనసంతా నిండెనే జ్ఞాపకాలతో
మనసంత నిండెనే జ్ఞాపకాలతో ....
![](https://s2.save4k.ru/pic/wGMbHrrCTGc/maxresdefault.jpg)